- Islamic Resource Centre
- ABUL IRFAN
- 2011
- 264
- Fourth Edition
- 3840
- 1723
- 1295
మహనీయ ముహమ్మద్ (స) ఆదర్శ జీవితం
మహనీయ ముహమ్మద్ (స) ఆదర్శ జీవితం ఇస్లాం స్త్రీని శైశవ థలో శుభవార్త అని, కౌమార థలో కూతురిగా, చెల్లిగా నరక ముక్తి మార్గం అని, పెళ్ళయిన తర్వాత ప్రపంచ సంపదల్లోకెల్లా మేలిమి సంపద పుణ్యవతి అయిన ప్రమిద అని, తల్లి అయ్యాక – స్వర్గమే ఆమె పాదాల చెంత ఉందని ఎనలేని కీర్తిని, గౌరవాన్ని ప్రసాదించింది. మానవ చరిత్రలో ఎక్కడయితే పురుషులు తనదయిన ముద్రను వదిలారో అక్కడే స్త్రీలు సయితం తనదయిన ముద్రను వదలి వెళ్ళారు. కొందరంటారు- ‘స్త్రీలు దైవ ప్రవక్తలుగా ఎందుకు లేరు?’ అని. ‘ప్రవక్తల వంటి మహా మహులను కడుపున మోసిన భాగ్యం, ఆలనా పాలన అదృష్టం ఆమెకే దక్కింది’ అన్నది వారికి మా సమాధానం. మానవ జాతి మొత్తానికి అమ్మ అయిన హజ్రత్ హవ్వా (అ), మూసా (అ) తల్లి, ఫిర్‌ఔన్ భార్య, సబా దేశ రాణి, ప్రవక్త ఈసా (అ) తల్లి మర్యం, ప్రవక్త (స) వారి గారాల పట్టి ఫాతిమా (ర.అ), ప్రియ సతీమణి ఖదీజా (ర.అ), పుణ్య సహా బియా సుమయ్యా (ర.అ)..ఇలా మానవాభ్యుదయంలో సమిధలయిన ప్రమిదలు ఎందరో!